రేపు ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రేపు (మే 2) ఏపీలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు గడ్కరీ విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి అరకు లోక్ సభ స్థానం పరిధిలోని వెంకంపేట వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సభలో పాల్గొంటారు. 

సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం, సాయంత్రం 6.15 గంటలకు గడ్కరీ నాగ్ పూర్ వెళ్లనున్నారు.

Nitin Gadkari
BJP
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News